నిరుపేదల సొంతింటి కల సాకారం
ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల: ఇందిరమ్మ ఇళ్ల పథకంతో నిరుపేదల సొంతింటి కల నెరవేరుతోందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మల్కాపూర్‌లో సోమవారం సద్దుల ఈశ్వరమ్మ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రా రంభించి, అనంతరం వార్డులో 10లక్షల నిధులతో వేస్తున్న సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల కుటుంబసభ్యలను శాలువాతో సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో ము న్సిపాలిటీ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.


