గండిచెరువులో ఇద్దరి నామినేషన్లు తిరస్కరించండి | - | Sakshi
Sakshi News home page

గండిచెరువులో ఇద్దరి నామినేషన్లు తిరస్కరించండి

Dec 9 2025 10:43 AM | Updated on Dec 9 2025 10:43 AM

గండిచెరువులో ఇద్దరి నామినేషన్లు తిరస్కరించండి

గండిచెరువులో ఇద్దరి నామినేషన్లు తిరస్కరించండి

ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని రైతు ఫిర్యాదు

అబ్దుల్లాపూర్‌మెట్‌: సర్పంచ్‌ ఎన్నికల నామినేషన్‌ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చి రిటర్నింగ్‌ అధికారులను తప్పుదోవ పట్టించిన గండిచెరువుకు చెందిన జక్క వెంకట్‌రెడ్డి, జక్క పాపిరెడ్డి నామినేషన్లను తిరస్కరించాలని గ్రామానికి చెందిన రైతు రొక్కం జనార్ధన్‌రెడ్డి సోమవారం కలెక్టర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ ఎంపీడీఓ, ఎంపీఓలకు ఫిర్యాదు చేశాడు. గండిచెరువు సర్వే నంబర్‌ 185, 186, 188, 190, 192, 196, 197లలోని పట్టా భూమి తనకు చెందినదని, దాంట్లో ఎలాంటి లేఅవుట్లు, ప్లాట్లు చేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సర్పంచ్‌ పదవి కోసం జక్క వెంకట్‌రెడ్డి, జక్క పాపిరెడ్డి తన భూమిలో వారిద్దరికీ ప్లాట్లు ఉన్నాయని తప్పుడు సమాచారం ఇచ్చి, నామినేషన్లను దాఖలు చేశారన్నారు. తప్పుడు సమాచారాన్ని నమోదు చేసిన ఇద్దరి నామినేషన్లను తక్షణమే తిరస్కరించాలని అధికారులకు విజ్ఞప్తి చేసినట్లు జనార్ధన్‌రెడ్డి తెలిపారు.

ఓటు బహిర్గతం చేయొద్దు

జెడ్పీహెచ్‌ఎస్‌ హెచ్‌ఎంల అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆనంద్‌కుమార్‌

అనంతగిరి: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయు లు వేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ను సైతం సాధారణ ఓటు హక్కు వినియోగించుకునే బ్యాలెట్‌ బాక్స్‌లోనే కలిపిన తర్వాతే కౌంటింగ్‌ చేయాలని జెడ్పీహెచ్‌ఎస్‌ హెచ్‌ఎంల అసోసియేషన్‌ అధ్యక్షుడు తుప్పలి ఆనంద్‌కుమార్‌ సోమవారం ఓ ప్రకటనలో కోరారు. గతంలో అధికారులు సాధారణ బ్యాలెట్‌ను లెక్కించి అనంతరం చివరగా పోస్టల్‌ బ్యాలెట్‌ను లెక్కించడంతో తాము వేసిన ఓటు బహిర్గతమయ్యే అవకాశం ఉందన్నారు. ఓటు బహిర్గతం కావడంతో గ్రామాల్లో తమకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు కల్పించుకుని తాము వేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ను ఎన్నికల రోజు ఓటర్లు వేసిన బ్యాలెట్‌లోనే కలిపి కౌంటింగ్‌ చేయాలని కోరారు.

ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దు

ఎంపీడీఓ సృజనాసాహిత్య

మోమిన్‌పేట: పంచాయతీ ఎన్నికలను పక్బందీగా నిర్వహించాలని ఎంపీడీఓ సృజనాసాహిత్య సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో పంచాయతీ ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారుల(పీఓ)కు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పీఓలు బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలన్నారు. అలసత్వం వహిస్తే ఇబ్బందులుంటాయని చెప్పారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌కు అనుమతులు ఇవ్వాలని ఆమె తెలిపారు. క్యూలో నిలబడితే ఎక్కువ సమయం కేటాయించాలని ప్రతీ విషయంపై ఉన్నాతాధికారులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని ఆమె సూచించారు. మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించాలన్నారు. సర్పంచ్‌ ఓట్ల లెక్కింపు, వార్డు మెంబర్ల ఓట్ల లెక్కింపు అనంతరం ఉప సర్పంచ్‌ ఎన్నికలను చేతులేత్తే సంస్కృతితో చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ యాదగిరి, మండల వ్యవసాయాధికారి రామకృష్ణారెడ్డి, ఎన్నికల పీఓలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement