అభివృద్ధి ప్రదాతను ఎన్నుకోండి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి ప్రదాతను ఎన్నుకోండి

Dec 9 2025 10:43 AM | Updated on Dec 9 2025 10:43 AM

అభివృద్ధి ప్రదాతను ఎన్నుకోండి

అభివృద్ధి ప్రదాతను ఎన్నుకోండి

కొత్తూరు: గ్రామాభివృద్ధికి పాటుపడే వారినే సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలని ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌ రెడ్డి సూచించారు. మండల పరిధిలోని తీగాపూర్‌లో సోమవారం ఆయన బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థి జయప్రద జగన్మోహన్‌రెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఉచిత హామీలు ఇచ్చే నాయకులను గమనించాలన్నారు. నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ బలపరిచిన వ్యక్తులే అధికరంగా గెలుస్తారని దీమా వ్యక్తం చేశారు. తీగాపూర్‌ ప్రజలు, ఓటర్లు జయప్రద జగన్మోహన్‌రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణ, నర్సింహ, రమేశ్‌, శ్రీనివాస్‌రెడ్డి, బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement