ఆదరించండి.. అభివృద్ధి చూపిస్తా
కడ్తాల్: బాలాజీనగర్ తండా సమస్యలను ఒంటి చేత్తో పరిష్కరించి అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి నేనావత్ అమర్‌సింగ్ ప్రచారంలో దూసుకెళ్తున్నాడు. గ్రామానికి చెందిన అమర్‌సింగ్ 15 ఏళ్ల క్రితం వ్యవసాయ పొలంలో పంపుసెట్ వద్ద జరిగిన ప్రమాదంలో తన కుడిచేతిని కోల్పోయాడు. అధైర్య పడకుండా డిగ్రీ పూర్తి చేశాడు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో గ్రామ యువత విద్యావంతుడిని సర్పంచ్ చేయాలనే పట్టుదలతో అమర్‌సింగ్‌కు మద్దతు తెలుపుతోంది. తన గెలుపుతో తండాను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే పట్టుదలతో ప్రయత్నిస్తున్నాడు.
బాలాజీనగర్ తండా సర్పంచ్ అభ్యర్థి అమర్‌సింగ్


