క్రికెట్‌లో ‘అరుణతేజం’
● జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న కొండారెడ్డిపల్లి యువకుడు
● స్పాన్సర్‌షిప్ అందిస్తే సత్తాచాటుతానని ధీమా
కేశంపేట: మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కర్నెకోట అరుణ్‌తేజ్ ఆంధ్రప్రదేశ్ తరఫున జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈనెల 24 నుంచి 27 వరకు ఢిల్లీలో జరిగే అండర్– 19 జట్టుకు (ఆల్ రౌండర్) ఎంపికయ్యాడు. అరుణ్‌తేజ్ ప్రస్తుతం బెంగళూర్‌లో స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ చదువుతున్నాడు. గతంలో అండర్– 12, అండర్– 14, అండర్– 19 విభాగాల్లో నిర్వహించిన పలు టోర్నీల్లో తెలంగాణ తరఫున పాల్గొ న్నాడు. అనంతరం తెలంగాణ నుంచి మా ్యచ్‌లు ఆడే అవకాశాలు రాకపోవడంతో, నా లుగేళ్లుగా ఏపీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఎపీలోని ఒంగోలుకు చెందిన రంజీ ప్లేయర్ షేక్ హఫీజ్ సారథ్యంలో ఏపీ తరఫున హైదరాబాద్‌లోని ఉప్పల్ శిక్షణను పొందుతున్నాడు. 2021నుంచి ఏపీ తరఫున ఆడుతున్నా డు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యలో తెలంగాణ సీఎం పేషీలో స్పాన్సర్ షిప్ కోసం చేసుకున్న దరఖాస్తును తిరస్కరించినట్లు అరుణ్ తెలిపా డు. స్పాన్సర్స్ ఎవరైనా చేయూతనిస్తే అంతర్జాతీయ క్రికెట్ టీంలో స్థానం సాధించి, దేశం తరఫున తలపడుతానని పేర్కొంటున్నారు.


