చివరి రోజు జోరు
వార్డులకు దాఖలైన నామినేషన్లు
మండలం జీపీలు దాఖలైనవి మొత్తం
ఇబ్రహీంపట్నం 14 58 95
మంచాల 23 116 141
యాచారం 24 115 168
అబ్దుల్లాపూర్‌మెట్ 14 40 84
మహేశ్వరం 30 99 192
కందుకూరు 35 132 223
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం, కందుకూరు డివిజన్లలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. చివరిరోజు కావడంతో ఆశావహులంతా పెద్ద సంఖ్యలో సర్పంచ్, వార్డు మెంబర్స్ పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు. తమ అనుచరులు, బంధువులు, కుటుంబసభ్యులతో కలిసి రావడంతో ఆయా క్లస్టర్లలో సందడి వాతావరణం కనిపించింది. పలుచోట్ల డప్పు వాయిద్యాలతో ర్యాలీగా తరలివచ్చారు. నామినేషన్లు వేసే వారికి సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఆయా క్లస్టర్స్ వద్ద హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. క్లస్టర్ లోపల సాయంత్రం 5 గంటల లోపు ఉన్నవారికి టోకెన్లు ఇచ్చి క్యూలైన్‌లో కూర్చోబెట్టారు. రాత్రివరకు నామినేషన్లు స్వీకరించారు. ఆయా క్లస్టర్లలో నామినేషన్ల ప్రక్రియలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది.
మహేశ్వరం మండలంలో 258 వార్డులకు 815, యాచారం మండలంలో 232 వార్డులకు 780, అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని 134 వార్దులకు 449, ఇబ్రహీంపట్నం 144 వార్డులకు 458, మంచాల మండలంలో 216 వార్డులకు 565, కందుకూరు మండలంలోని 312 వార్డులకు 962 నామినేషన్లు చివరి రోజు వరకు దాఖలైనాయి.
మూడోవిడతలో ముగిసిన నామినేషన్ల పర్వం
పలుచోట్ల డప్పు వాయిద్యాలతో ర్యాలీగా వచ్చిన అభ్యర్థులు
క్లస్టర్లలో సందడి వాతావరణం


