రైతులకు రసీదులు తప్పనిసరి ఇవ్వాలి
చేవెళ్ల: రైతులకు అమ్మే ఎరువు, విత్తనాలకు సంబంధించి రసీదులు తప్పనిసరి ఇవ్వాలని జిల్లా వ్యవసాయాధికారి ఉష అన్నారు. మండలంలోని పలు ఎరువులు, విత్తనాల, పురుగు మందుల దుకాణాలను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్లు, ఇన్‌వాయిస్‌లను పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, మందులను విక్రయించాలని సూచించారు. మోసం చేసినట్లు తెలిస్తే దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. అనంతరం మండలంలోని పలువురు రైతుల పొలాలను పరిశీలించి సాగు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట మండల వ్యవసాయాధికారి శంకర్‌లాల్ ఉన్నారు.
యాచారం: పంచాయతీ ఎన్నికల నిర్వహణలో లోపాలుండొద్దని జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి అన్నారు. మండల పరిధిలోని మాల్ క్లస్టర్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాధారాణి పాల్గొన్నారు.
బ్యాలెట్ బాక్స్‌ల పరిశీలన
మాడ్గుల: మండల పరిషత్ కార్యాలయంలో బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ను శుక్రవారం జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి సందర్శించారు. బ్యాలెట్ బాక్స్‌ల్లో ఏమైనా ఇబ్బందులుంటే వెంటనే సరి చేయించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఎంపీడీవో చాంబర్‌లో ఎన్నికల నిర్వహణపై ఎంపీడీవో విజయలక్ష్మి, సీఐ వేణుగోపాల్ రావుతో చర్చించారు.
ఇబ్రహీంపట్నం రూరల్: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జెడ్పీ సీఈఓ మాట్లాడుతూ.. సానుభూతి కంటే సమాన అవకాశాలు కల్పించడానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ శ్రీలత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పద్మావతి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి డీసీ నాయక్, హౌసింగ్ పీడీ బోజప్ప తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
పరిగి: జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పరిగి విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. జడ్చర్లలో జరిగిన జాతీయ స్థాయి పోటీలో పరిగి పట్టణంలోని గ్లోబల్ స్కూల్ నాలుగో తరగతి విద్యార్థి ఆష్నా సాదియాబేగం, మూడో తరగతి విద్యార్థులు ఆఫ్మిన్‌రహామత్, జునైరా షేక్ ప్రథమ స్థానంలో నిలిచారు. శుక్రవారం విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.
రైతులకు రసీదులు తప్పనిసరి ఇవ్వాలి
రైతులకు రసీదులు తప్పనిసరి ఇవ్వాలి


