విజ్ఞాన దీపిక.. చేవెళ్ల వేదిక
సైన్స్ ఫెయిర్‌కోసం ఏర్పాటు చేసిన స్టాల్స్
ఏర్పాట్లను పరిశీలిస్తున్న తెలంగాణ మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్
చేవెళ్ల: తెలంగాణ మోడల్ స్కూల్స్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి మోడల్ స్కూల్స్ సైన్స్ ఫెయిర్‌కు చేవెళ్ల మోడల్ స్కూల్ వేదికై ంది. ఇగ్నైట్ –2025 పేరుతో రెండు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమం శనివారం ప్రారంభం కానుంది. సైన్స్ ఫెయిర్‌లో రాష్ట్రంలోని 194 మోడల్ స్కూల్స్ నుంచి ఉపాధ్యాయులు, విద్యార్థులు శుక్రవారం చేరుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకొని తమకు కేటాయించిన స్టాల్స్ నంబర్లను పరిశీలించుకొని ప్రదర్శనలకు సిద్ధం చేసుకున్నారు. వచ్చినవారికి అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు. 42 స్టాళ్లలో 388 శాసీ్త్రయ నమూనాలను ప్రదర్శించనున్నారు.
ఏర్పాట్ల పరిశీలన
చేవెళ్ల మోడల్ స్కూల్‌లో ఏర్పాట్లను శుక్రవారం తెలంగాణ మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్‌చారి, జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు, ఎంఈఓ పురన్‌దాస్ పరిశీలించారు. స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి పలు సూచనలు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్, ఐఏఎస్ డాక్టర్ నవీన్ నికోలస్ ముఖ్యఅతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. కలెక్టర్ సి.నారాయణరెడ్డి తదితరులు హాజరవుతారని చెప్పారు. సైన్స్ ఫెయిర్‌ను వీక్షించేందుకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఎవరైనా రావచ్చని సూచించారు. ఇలాంటి విజ్ఞాన వేదికలు విద్యార్థుల మేధోశక్తిని పెంపొందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.
నేటినుంచి రాష్టస్థాయి సైన్స్ ఫెయిర్
ఇగ్నైట్ –2025 పేరుతో నిర్వహణ
ఆవిష్కరణలకు సిద్ధమైన విద్యార్థులు
రాష్ట్రంలోని 194 మోడల్ స్కూల్స్ నుంచి హాజరు
ఏర్పాట్లను పరిశీలించిన తెలంగాణ మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్
విజ్ఞాన దీపిక.. చేవెళ్ల వేదిక


