ఉప్పుగడ్డ తండా.. ఏకగ్రీవానికి అండ
మహేశ్వరం: మండలంలోని ఉప్పుగడ్డ తండాలో సర్పంచ్‌తోపాటు ఆరు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. పంచాయతీ జనరల్‌కు రిజర్వు అయింది. సర్పంచ్ అభ్యర్థిగా నేనావత్ రాజు నాయక్ ఒక్కరే నామినేషన్ వేశారు. రాజునాయక్ పీజీ వరకు చదువుకున్నాడు. విద్యావంతుడు కావడంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాడన్న విశ్వాసంతో గ్రామస్తులంతా కలిసి సమావేశమై ఏకగ్రీవమయ్యేలా చేశారు. తండాలో ఉన్న ఆరు వార్డులకు సైతం ఏకగ్రీవానికి ఒక్కటిగా నిలిచారు. 1వ వార్డు కేతావత్ మోహన్, 2వ వార్డు కేతావత్ సాలి, 3వ వార్డు బాధవాత్ పరమేష్ నాయక్, 4వ వార్డు వర్‌ాత్యవత్ సరిత, 5వ వార్డు పాల్త్యావత్ విజయ, 6వ వార్డు సభ్యులుగా నేనావత్ రవీందర్ నాయక్ ఒక్కో నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
సర్పంచ్‌తో పాటు ఆరు వార్డులు సైతం


