సర్పంచ్‌లకు 235 వార్డులకు 1,350
రెండో రోజు సర్పంచ్‌కు నామినేషన్లు
● రెండో రోజు కొనసాగిన మూడో విడత నామినేషన్లు
● రాత్రి వరకు క్యూలో నిలబడి దాఖలు చేసిన అభ్యర్థులు
ఇబ్రహీంపట్నం: మూడో విడత నామినేషన్ల పర్వం గురువారం రెండో రోజు కొనసాగింది. మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత మహూర్తం బాగుందని అభ్యర్థులు సాయంత్రం 4గంటల తర్వాత క్లస్టర్ కార్యాలయాలకు తరలివచ్చారు. రాత్రి కావడంతో టోకెన్లు తీసుకుని క్యూలో నిల్చున్నారు. ఆయా మండలాల పరిధిలోని పంచాయతీల్లో సర్పంచ్‌లకు 235 నామినేషన్లు, వార్డులకు 1,350 దాఖలయ్యాయి.
వార్డులకు దాఖలైనవి..
ఇబ్రహీంపట్నం మండలంలోని 144 వార్డులకు 130 నామినేషన్లు, మంచాలలోని 216 వార్డులకు 94, యాచారంలో 232 వార్డులకు 230, అబ్దుల్లాపూర్‌మెట్‌లోని 134 వార్డులకు 185, కందుకూరులోని 312 వార్డులకు 388, మహేశ్వరంలోని 258 వార్డులకు 323 నామినేషన్లు గురువారం దాఖలయ్యాయి.
మండలం జీపీలు దాఖలైనవి మొత్తం
ఇబ్రహీంపట్నం 14 25 37
మంచాల 23 25 40
యాచారం 24 52 66
అబ్దుల్లాపూర్‌మెట్ 14 28 42
మహేశ్వరం 30 53 93
కందుకూరు 35 52 91


