బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర షురూ
ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
మంచాల: బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండల పరిధిలోని ఆరుట్ల గ్రామంలో బుగ్గరామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రూ.1.15 కోట్లతో బీటీ రోడ్డు , రూ.25 లక్షలతో సీసీ రోడ్డును ప్రారంభించారు. పీఏసీఎస్ చైర్మన్ వెదిరె హన్మంత్‌రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం నిర్మించిన ప్రసాద వితిరణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ సంవత్సరం 15 రోజుల పాటు నిర్వహించే బుగ్గరామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు విచ్చేస్తారన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి పున్యస్నానాలు ఆచరించారు.


