మంత్రికి కృతజ్ఞతా సన్మానం
కందుకూరు: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబును జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బొక్క జంగారెడ్డి తదితరులు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం మంత్రి నివాసంలో మంఖాల్ పరిధిలోని డబుల్ బెండ్రూం ఇళ్లు పంపిణీ చేశారు. నిరుపేదలకు డబుల్ ఇళ్లు అందించినందుకు వారి తరపున మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.కృష్ణనాయక్, వైస్ చైర్మన్ యాదయ్య, డైరెక్టర్లు బి.ప్రశాంత్‌కుమార్, కె.విష్ణువర్ధన్‌రెడ్డి, మహేశ్వరం ఆలయ కమిటీ చైర్మన్ పల్లె కుమార్ పాల్గొన్నారు.


