క్షతగాత్రులను పరామర్శించిన స్పీకర్
చేవెళ్ల/మొయినాబాద్: రోడ్డు ప్రమాద ఘటనపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడి చేవెళ్లలోని పట్నం మహేందర్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని సోమవారం మధ్యాహ్నం పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
చేవెళ్ల/మొయినాబాద్: ప్రమాద ఘటన తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు రోడ్డు నాలుగు లేన్లుగా మారితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదన్నారు.
వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్
అనంతగిరి: బస్సు ప్రమాదంలో గాయపడి వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పదిమందిని కలెక్టర్ ప్రతీక్‌జైన్ పరామర్శించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని తెలియజేయాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ వాసుచంద్ర, సీఐ భీంకుమార్ ఉన్నారు.
రోడ్డు ప్రమాదం కలచివేసింది. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. రోడ్డు మంజూరై ఆరేడేళ్లు అవుతున్నా ఎన్‌జీటీలో కేసు కారణంగా ఆలస్యమైంది. అప్పా నుంచి మన్నెగూడ రోడ్డుకు ఇటీవలే లైన్ క్లియర్ అయ్యింది. త్వరలో పనులు చేపట్టేలా కృషి చేస్తాను. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.
– కాలె యాదయ్య, ఎమ్మెల్యే, చేవెళ్ల
మృతదేహాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య
							క్షతగాత్రులను పరామర్శించిన స్పీకర్
							క్షతగాత్రులను పరామర్శించిన స్పీకర్

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
