సాంబారు, సేమియాలో ఈగలు | - | Sakshi
Sakshi News home page

సాంబారు, సేమియాలో ఈగలు

Nov 4 2025 8:09 AM | Updated on Nov 4 2025 8:09 AM

సాంబా

సాంబారు, సేమియాలో ఈగలు

తుక్కుగూడ: రుచికరమని హోటల్లో తింటే.. సుచి కరువై.. ఆరోగ్యానికి చేటని మరోసారి రుజువైంది. నిర్వాహకుల నిర్లక్ష్యంతో రుచి, శుభ్రత సంగతి ఎలా ఉన్నా.. సాంబర్‌, సేమియాలో ఈగలు ప్రత్యక్షమై.. భోజన ప్రియులకు వికారం తెప్పించాయి. ఈ సంఘటన సోమవారం పుర పరిధి ఇమూమ్‌గూడ తాజ్‌ హోటల్లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రావిర్యాల గ్రామానికి చెందిన పాల్లకూర్ల వెంకటేశ్‌.. మధ్యాహ్న వేళలో భోజనం చేయడానికి హోటల్‌కు వచ్చారు. మీల్స్‌ ఆర్డర్‌ చేయగా.. నిర్వాహకులు అన్నం, సాంబర్‌, స్వీట్‌ తదితర పదార్థాలను వడ్డించారు. అందులో సాంబర్‌, సేమియాలో ఈగలు కనిపించాయి. ఇదే విషయమై..వినియోగదారుడు, యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. వారు నిర్లక్ష్య సమాధానం ఇచ్చారు.దీంతో పుర అధికారులు ఫిర్యాదు చేస్తానని సదరు వ్యక్తి తెలిపారు.

‘హైటెన్షన్‌’తో నష్టపోతున్నాం.. ఆదుకోండి

కేంద్ర మంత్రికి విన్నవించిన రైతులు

కడ్తాల్‌: హైటెన్షన్‌ లైన్‌తో నష్టపోతున్నామని, అలైన్‌మెంట్‌ను మార్చి న్యాయం చేయాలని బాధిత రైతులు కోరారు. సోమవారం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ ఆధ్వర్యంలో రైతులు ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను కలిసి విన్నవించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. కడ్తాల్‌ మండలకేంద్రంతో పాటు.. పలు గ్రామాల మీదుగా తప్పుడు అలైన్‌మెంట్‌తో సన్న చిన్న కారు రైతులకు సమాచారం ఇవ్వకుండా, వారి పంటపొలాల మీదుగా 765 కేవీ హైటెన్షన్‌ సోలార్‌ పవర్‌ గ్రిడ్‌లైన్‌ను తీయడం అన్యాయమని పేర్కొన్నారు. దీనికి స్పందించిన మంత్రి.. సంబంధిత అధికారులతో మాట్లాడి, న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారని రైతులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, బీసీ సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశ్‌, మాజీ ఉప సర్పంచ్‌ రామకృష్ణ, రైతు నాయకులు పెంటారెడ్డి, పర్వతాలుయాదవ్‌, శివరామకృష్ణ, సత్యం తదితరులు ఉన్నారు.

మార్కెట్‌ భూమి హెచ్‌ఎండీఏదే..

సాక్షి, సిటీబ్యూరో: బాటసింగారం ఫ్రూట్‌ మార్కెట్‌ భూమి హెచ్‌ఎండీఏదేనని ది ఫ్రూట్‌ కమీషన్‌ ఏజెంట్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు అచ్చ శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. కొందరు మార్కెట్‌ అసోసియేషన్ల నేతలు.. ఆ భూమి కమీషన్‌ ఏజెంట్లు, వారి బంధువులదని ప్రచారం చేస్తున్నారని, అది అవాస్తవమన్నారు. మార్కెట్‌ కమిటీ, కార్యదర్శి వద్ద నెలనెలా ఎవరు అద్దె చెల్లిస్తున్నారో రికార్డు ఉందని పేర్కొన్నారు. మామడి సీజన్‌లోనూ అద్దెకు తీసుకుంటున్న భూమి కూడా వారిది కాదని స్పష్టం చేశారు. ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ప్రిన్సిపాల్‌పై సీఎంకు నివేదిక

ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ చిన్నారెడ్డి

షాద్‌నగర్‌: గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ వ్యవహార శైలి, కళాశాల దుస్థితిపై త్వరలో సీఎం రేవంత్‌రెడ్డికి నివేదిక అందజేయనన్నామని ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ చిన్నారెడ్డి తెలిపారు. సోమవారం పట్టణ శివారు నూర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో కొనసాగుతున్న నాగర్‌కర్నూల్‌ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల డిగ్రీ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు. వారి పట్ల ప్రిన్సిపాల్‌ శైలజ వ్యవహరించిన తీరుపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని చెప్పారు.

ప్రిన్సిపాల్‌పై సస్పెషన్‌ వేటు

విద్యార్థులను వేధింపులకు గురి చేస్తూ, అవినీతికి పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో నాగర్‌కర్నూల్‌ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ శైలజపై ఉన్నతాధికారులు సస్పెషన్‌ వేటు వేశారు. ఈ మేరకు సోమవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ అమరేందర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రిన్సిపాల్‌ వేధింపులకు నిరసనగా.. ఆదివారం విద్యార్థినులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాథమిక విచారణ అనంతరం ఆమె సస్పెషన్‌ వేటు పడింది.

సాంబారు, సేమియాలో ఈగలు 1
1/4

సాంబారు, సేమియాలో ఈగలు

సాంబారు, సేమియాలో ఈగలు 2
2/4

సాంబారు, సేమియాలో ఈగలు

సాంబారు, సేమియాలో ఈగలు 3
3/4

సాంబారు, సేమియాలో ఈగలు

సాంబారు, సేమియాలో ఈగలు 4
4/4

సాంబారు, సేమియాలో ఈగలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement