ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించండి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఆయనతో పాటు.. డీఆర్‌ఓ సంగీతలు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ.. అర్జీదారులను ఇబ్బందులకు గురి చేయకుండా.. వారి సమస్యలకు పరిష్కారం మార్గం చూపాలని సూచించారు. ప్రజావాణికి 25 దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి నివాళి అర్పించి, మౌనం పాటించారు.
పరిహారం పెంచి ఇవ్వండి
గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం పెంచి ఇవ్వాలని కొంగరకలాన్ రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం బాధిత రైతులు మా ట్లాడారు. కొంగరకలాన్ రెవెన్యూలో భూములు కో ల్పోతున్న వారికి, భూ విలువ పెంచకుండా పరి హారం ఇస్తామనడటం మంచిది కాదన్నారు. బహి రంగ మార్కెట్లో ఎకరాకు రూ.పది కోట్లు పలుకుతుండగా.. మార్కెట్ ధర పెంచకుండా పరిహారం ఇవ్వాలని చూడటం తగదన్నారు. ఎకరాకు రూ.15 లక్షలు ఉన్న ధరను.. కోటికి పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిలత, ప్రహ్లాద్, శ్రీశైలం, మల్లేశ్, నర్సింహ, శ్రీనివాస్‌రెడ్డి, పాశం రాజు పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి


