గ్రామస్తుల ఆందోళన
మొయినాబాద్ రూరల్: మీర్జాగూడ రోడ్డు ప్రమాద విషయం తెలుసుకున్న చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో అక్కడకు వస్తున్న అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రశ్నించి రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ రోడ్డుపై హైదరాబాద్ అప్పా మొదలుకొని తాండూరు, పరిగి, కొడంగల్ ప్రాంతాలకు ముఖ్యమంత్రితో పాటు స్పీకర్, ఎమ్మెల్యేలు తిరుగుతున్నా గుంతలు కనపడడం లేదని ఆందోళన చేపట్టారు. తాండూరు ప్రాంతానికి చెందిన ప్రయాణికులు కావడంతో తాండూరువాసులు అధికంగా వచ్చారు. జాతీయ రహదారిపై సంఘటనా స్థలంలో జనసందోహం ఏర్పడింది.
మెరుగైన వైద్యం అందిస్తున్నాం
రాష్ట్ర వైద్యాధికారి
అనంతగిరి: బస్సు ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరో గ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ నరేంద్రకుమార్ తెలిపా రు. సోమవారం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికి త్స పొందుతున్న వారిని పరామర్శించి, వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. లక్ష్మణ్ తలకు తీవ్ర గాయాలు కావడంతో నిమ్స్‌కు తరలించామన్నారు. మిగితా వారి పరిస్థితి నిలకడగా ఉందన్నా రు. ఆయన వెంట వైద్యశాఖ ఉన్నతాధికారులు, ఆస్ప త్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి ఉన్నారు.
అండగా ఉంటాం
తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
తాండూరు: బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి తెలిపారు. సోమవారం చేవెళ్ల ఆస్పత్రిలో బాధిత కుటుంబాలను ఓదార్చారు. అంత్యక్రియల నిమిత్తం ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన వెంట తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌రెడ్డి ఉన్నారు.


