ప్రభుత్వం ఆదుకుంటుంది
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
పరిగి: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మృతిచెందిన కుటుంబాలను, క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో కలిసి పరామర్శించారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో ఇంతమంది ప్రయాణికులు మృతిచెందడం బాధాకరమని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యంతోనే ఇప్పటి వరకు రోడ్డు విస్తరణ పనులు జరగలేవని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఉన్నకేసును విరమింపచేసేలా కృషి చేసిందన్నారు. పనులు కూడా జరుగుతున్నాయన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
