ఉబికి వస్తున్న గంగమ్మ
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా మండలంలోని బాటసింగారం గ్రామానికి చెందిన హరిబాబు ఇంట్లో ఉన్న బోరు బావి నుంచి గంగమ్మ పైకి ఉబికి వస్తోంది. కొన్ని రోజులుగా భూమిలోంచి నీరు పైకి వస్తుందని, మూడేళ్లుగా ప్రతి అక్టోబర్–నవంబర్ మాసాల్లో ఇలా నీరు పైకి పొంగి వస్తుంటుందని హరిబాబు పేర్కొన్నారు. తాము ఇంటి నిర్మాణం చేయించే సమయంలో 780 అడుగుల లోతు వరకూ బోరు బావిని తవ్వించామని, అప్పుడు తమ అవసరాలకు సరిపడా నీళ్లు మాత్రమే వచ్చేవని, మూడేళ్లుగా ఇలా నీరు పైకి పొంగుతున్నాయన్నారు.
– అబ్దుల్లాపూర్‌మెట్

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
