బీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు
పహాడీషరీఫ్: పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు బీఆర్‌ఎస్‌లో సముచిత స్థానం ఉంటుందని మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు సబితారెడ్డి అన్నారు. జల్‌పల్లి మున్సిపాలిటీలోని కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు కార్యకర్తలు ఆదివారం ఆమె సమక్షంలో బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. జల్‌పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం సబితారెడ్డి ఏళ్ల తరబడిగా ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ ప్రాంతంపై ఆమెకున్న ప్రత్యేక శ్రద్ధ, కాంగ్రెస్, బీజేపీల ద్వంద్వ వైఖరీలు నచ్చలేకే తాము బీఆర్‌ఎస్‌లో చేరుతున్నామన్నారు. సబితమ్మ నాయకత్వంలో ఈసారి జల్‌పల్లి మున్సిపాలిటీ స్థానిక ఎన్నికలలో బీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తామని పేర్కొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
