సీఎంకు పౌల్ట్రీ రైతుల కృతజ్ఞతలు
షాద్‌నగర్: ప్రభుత్వం పౌల్ట్రీ రైతుల ఆస్తి పన్ను బకాయిలను రద్దు చేయడంతో బుధవారం వారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. షాద్‌నగర్‌కు చెందిన పలువురు పౌల్ట్రీ రైతులు హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పౌల్ట్రీ రైతులు వెంకట్‌రావు, వసంతరావు, మల్లేశ్వర్‌రావు, శ్రీనివాసరావు, సాంబశివరావు, సురేశ్ పాల్గొన్నారు.
ఆమనగల్లు: ధ్యానంతో మానసిక ఒత్తిడి తగ్గించుకుని ఆనందమయ జీవితం గడపవచ్చని హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ, శ్రీరామచంద్ర మిషన్ శిక్షకులు నాగరాజు, విజయతులసి, సంధ్యారాణి, సుందరి, సత్యనారాయణ అన్నారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణ లో బుధవారం ప్రభుత్వశాఖల అధికారులు, సిబ్బందికి ధ్యానంపై ఉచిత శిక్షణ అందించా రు. ఈ సందర్భంగా శిక్షకులు మాట్లాడుతూ.. ధ్యానంతో సంపూర్ణజీవితం ఆనందంగా గడపవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా శారీరక, మానసిక ఒత్తిడి జయించడానికి చేయాల్సిన ధ్యాన పద్ధతులను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కుసుమ మాధురి, పీఆర్ డీఈఈ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శంకర్, ఎస్‌ఐ వెంకటేశ్, ఎంపీఓ వినోద, ఏఈ లు అభిషేక్, శాలిని తదితరులు పాల్గొన్నారు.
పశుసంవర్ధక శాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ సుభాశ్
మొయినాబాద్: ప్రతీ పశువుకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా తప్పక వేయాలని పశుసంవర్ధక శాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ సుభాశ్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని హిమాయత్‌నగర్‌లో బుధవారం చేపట్టిన గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని ఆయన ఆకస్మి కంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల వద్ద ఉన్న ప్రతీ పశువును గుర్తించి వాటికి ముందు జాగ్రత్త చర్యగా టీకా వేయాలన్నారు. రైతులకు అవగాహన కల్పించాలని పశువైద్య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి అహ్మద్, సిబ్బంది ప్రసన్నకుమార్, భీంరావ్, గోరేమియా తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం రూరల్: తన కూతురు వివాహ వేడుకకు హాజరైన బంధువులు, అతిథులకు రాజ్యాంగం పుస్తకాలను రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చారు ఓ న్యాయవాది. వివరాలు ఇలా ఉన్నాయి.. నల్గొండ జిల్లా సూర్యపేట ప్రాంతం, పణిగిరికి చెందిన విశాఖ మాధవ కృష్ణారెడ్డి హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తూ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. బుధవారం తన కూతురు ఆశృతరెడ్డి వివాహాన్ని కొంగరకలాన్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. న్యాయవాద వృత్తిపై ఉన్న మమకారంతో పాటు భారత రాజ్యాంగంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వెయ్యిమందికిపైగా.. 408 పేజీలతో ఉన్న పుస్తకాలను అందజేశారు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వేముల వీరేశం, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కంచె అయిలయ్య తదితరులు రిటర్న్ గిఫ్ట్‌లు తీసుకుని, వకీల్‌సాబ్ ఆలోచనను అభినందించారు.
సీఎంకు పౌల్ట్రీ రైతుల కృతజ్ఞతలు
సీఎంకు పౌల్ట్రీ రైతుల కృతజ్ఞతలు
సీఎంకు పౌల్ట్రీ రైతుల కృతజ్ఞతలు


