సీజనల్‌పై అప్రమత్తత అవసరం
షాద్‌నగర్ రూరల్: సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్యులు, విద్యాశాఖ, ఐసీడీఎస్ అధికారులు విధిగా గ్రామాల్లో పాఠశాలలకు వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వసతి గృహాల్లో మరుగుదొడ్లు, కిటికీలు, డోర్లు లేకుంటే వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు. అధికారులు హాస్టళ్లు, పాఠశాలలకు తూతూ మంత్రంగా వెళ్లి రాకుండా సమస్యలను పూర్తి స్ధాయిలో గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించాలని అన్నారు. ప్రతీ నెల వైద్య పరీక్షలు నిర్వహించి అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులకు చికిత్సలు నిర్వహించాలని అన్నారు. మిషన్ భగీరథ నీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగిరం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వనమహోత్సం కార్యక్రమంలో ప్రతీ గ్రామంలో పదివేల మొక్కలు నాటాలని సూచించారు. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వార పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. వ్యవసాయ పొలాల్లో నీటి నిల్వ గుంతలను ఏర్పాటు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఇళ్లలో ఇంకుగుంతలు ఏర్పాటు చేస్తే భూగర్భ జలాలు పెరిగి నీటి సమస్య తీరుతుందని అన్నారు. ఈ సమావేశంలో ప్రత్యేకాధికారి రామారావు, ఎంపీడీఓ బన్సీలాల్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి, ఎంపీఓ జయంత్‌రెడ్డి, అధికారులు గోపాల్, నిషాంత్‌కుమార్, ఉదయ, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ శ్రీనివాస్


