లక్కెవరికో! | - | Sakshi
Sakshi News home page

లక్కెవరికో!

Oct 27 2025 9:00 AM | Updated on Oct 27 2025 9:00 AM

లక్కె

లక్కెవరికో!

సోమవారం శ్రీ 27 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025 నేడు కలెక్టర్ల సమక్షంలో మద్యం షాపు దరఖాస్తులకు డ్రా 8లోu

న్యూస్‌రీల్‌

ఎకై ్సజ్‌ డివిజన్ల వారీగా వచ్చిన దరఖాస్తులు

సోమవారం శ్రీ 27 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025
నేడు కలెక్టర్ల సమక్షంలో మద్యం షాపు దరఖాస్తులకు డ్రా

సాక్షి, రంగారెడ్డి జిల్లా: మద్యం షాపుల టెండర్‌ దరఖాస్తులకు సోమవారం ఉదయం లక్కీడ్రా నిర్వహించనున్నారు. హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల కలెక్టర్ల సమక్షంలో ఎంపిక చేసిన ఆయా కేంద్రాల్లో ఉదయం 11 గంటలకు ఈ లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సరూర్‌నగర్‌, శంషాబాద్‌ డివిజన్లలోని మద్యం దుకాణాలకు శంషాబాద్‌ మల్లిక కన్వెన్షన్‌ సెంటర్‌లో డ్రా నిర్వహించనున్నారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ డివిజన్లలోని షాపులకు జూబ్లీహిల్స్‌ జేఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌లో నిర్వహించనున్నారు. ఇక మేడ్చల్‌, మల్కాజ్‌గిరి డివిజన్లలోని షాపులకు పీర్జాదిగూడలోని శ్రీ పల్లవి కన్వెన్షన్‌లో, వికారాబాద్‌ డివిజన్‌లోని షాపులకు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ భవన్‌లో నిర్వహించనున్నారు. దరఖాస్తుదారులు ఉదయం తొమ్మిది గంటలకే ఆయా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంది. తమ వెంట ఎకై ్స జ్‌శాఖ ఇచ్చిన రసీదులను తీసుకురావాల్సి ఉంది. ఒకవేళ దరఖాస్తుదారు లేనిపక్షంలో ఆథరైజేషన్‌ లెటర్‌ తీసుకొచ్చిన వాళ్లను మాత్రమే లోనికి అనుమతించనున్నారు. ఇదిలా ఉంటే దరఖాస్తుదారుల్లో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఉండటం గమనార్హం. సరూర్‌నగర్‌ డివిజన్‌లో 1,732 మంది, శంషాబాద్‌లో 1,351 మంది మహిళలు ఉన్నారు. లక్కీ డ్రాలో షాపులను గెలుచుకున్న వాళ్లకు డిసెంబర్‌ నుంచి మద్యం సరఫరా చేయనున్నారు.

ఎకై ్సజ్‌ డివిజన్‌ మద్యం షాపులు దరఖాస్తులు

సరూర్‌నగర్‌ 138 7,845

శంషాబాద్‌ 111 8,536

మేడ్చల్‌ 118 5,791

మల్కాజ్‌గిరి 88 6,063

హైదరాబాద్‌ 80 3,201

సికింద్రాబాద్‌ 99 3,022

వికారాబాద్‌ 59 1,808

మల్లికగార్డెన్‌లో శంషాబాద్‌, సరూర్‌నగర్‌ డివిజన్లకు..

దరఖాస్తుదారుల్లో పెద్ద సంఖ్యలో మహిళలు

షాపులను గెలుచుకున్న వారికి డిసెంబర్‌ నుంచి మద్యం సరఫరా

లక్కెవరికో!1
1/2

లక్కెవరికో!

లక్కెవరికో!2
2/2

లక్కెవరికో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement