సాహిత్యం సమాజ శ్రేయస్సును కాంక్షించాలి
అఖిల భారత జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి
అనంతగిరి: సాహిత్యం సమాజ శ్రేయస్సును ఆకాక్షించాలని అఖిల భారత జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు, ఓయూ విశ్రాంత తెలుగు శాఖా ధిపతి ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్‌లోని సంకల్ప విద్యాపీఠం పాఠశాల ఆడిటోరియంలో పద్యపద భారతి సాహిత్య సంస్కృతిక కళా వేదిక ఆధ్వర్యంలో రిటైర్డ్ డైట్ ప్రిన్సిపాల్ బందెప్పగౌడ్ రచించిన సాయి శతకం ప్రకృతి వైద్య శతకాలను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కసిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. శతకం పాల్కురికి సోమన కాలం నుంచి నేటి వరకు సమాజ హితాన్ని ఆవిష్కరించిందన్నారు. కవి తన చుట్టూ సమస్యలు, జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించి పద్య, గేయ, వచన రూపంలో కవిత్వాన్ని వెలువరిస్తారని చెప్పారు. కవులు తమ శతకాలు, రచనల ద్వారా సమాజానికి జ్ఞానాన్ని అందించి మానవీయ విలువలను పెంపొందించాల న్నారు. రిటైర్డ్ డైట్ ప్రిన్సిపాల్ చంద్రప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. మానవులు ప్రపంచీకరణ నేపథ్యంలో పూర్వ భారతీయులు చెప్పిన ఆహార నియమాలు విడిచిపెట్టి పాశ్చాత్య పోకడలకు పోవడంతోనే రోగాల బారిన పడుతున్నారని చెప్పారు. భారతీయ వైద్య ఆయుర్వేద విధానానికి పూర్వ వైభవం తీసుకొచ్చి ఆధునీకరించి ప్రజలకు దగ్గర చేయాలని సూచించారు. కార్యక్రమంలో కవులు, రచయితలు డాక్టర్ తూర్పు మల్లారెడ్డి, గంటా మనోహర్‌రెడ్డి, డాక్టర్ బాగయ్య, శతవ ధాని మలుగ అంజయ్య, ధన్‌శెట్టి, రాఘవేంద్రాచార్యులు, లాల్‌రెడ్డి, విశ్వనాథం, సుధాకర్‌గౌడ్, డాక్టర్ రాజు, రెడ్యా రాథోడ్, శ్రీనివాస చారి, దివాకర్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.


