మూన్‌వాకర్‌పై స్పెషల్ డాక్యుమెంటరీ
తాండూరు వాసి వంశీకృష్ణకు దక్కిన అరుదైన అవకాశం
తాండూరు టౌన్: పట్టణంలోని వాల్మీకినగర్‌లో మూన్‌వాకర్‌గా పేరొందిన వంశీకృష్ణపై ప్రముఖ జాతీయ మీడి యా ఇండియా టీవీలో నవంబర్ 1న డాక్యుమెంటరీ ప్రసారం కానుంది. డ్యాన్సర్ మైఖేల్ జాక్సన్‌ను అనుసరిస్తూ పెరిగిన వంశీకృష్ణ మూన్‌వాక్‌తో పాటు పలు రకాల నృత్యాలు, యోగ, సింగర్, కరాటే సాధన వంటివి అలవర్చుకున్నాడు. గతంలో 2015లో మైఖేల్ జాక్సన్ పుట్టిన రోజైన ఆగస్టు 29న గంటలో 4.238 కిలోమీటర్లు మూన్‌వాక్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. 2016లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాణించిన దేశ ప్రముఖులతో పాటు వంశీకృష్ణ వివరాలు ప్రస్తావించారు. 2017 నవంబర్ 12న న్యూఢిల్లీలో సిరిఫోర్ట్ ఆడిటోరియంలో వివిధ దేశాల రికార్డు ప్రతినిధులచే అంతర్జాతీయ వీఐపీ హోదాని, 2019లో 315 పదాలతో ఏకధాటిగా ఫాస్టెస్ట్ ర్యాప్ సింగింగ్ చేసి రికార్డు సాధించాడు. 2021లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 5 నిమిషాల 19 సెకండ్ల పాటు గరుడాసనం వేసి రికార్డు సొంతం చేసుకున్నాడు.


