
ఏదీ ఆసరా?
న్యూస్‌రీల్
గురువారం శ్రీ 23 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
షాబాద్: కొత్త పింఛన్ల కోసం లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ‘ఆసరా’ అందక వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఇబ్బంది పడుతున్నారు. అన్ని అర్హతలున్నా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం పాత లబ్ధిదారులకు ఆసరా పింఛన్ అందజేసినా కొత్తవారికి అమలు చేయలేదు. దీంతో ఐదేళ్లుగా కొత్తవారు పింఛన్ మంజూరు కోసం నిరీక్షిస్తున్నారు. కొత్త ప్రభుత్వంలో అయినా అవకాశం వస్తుందని భావించినా ఎదురు తెన్నులు తప్పడం లేదు.
దరఖాస్తులు స్వీకరించినా..
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనా కార్యక్రమంలో భాగంగా పథకాల అమలుకు దరఖాస్తులు స్వీకరించింది. ఆసరా పథకం ద్వారా పింఛన్ పొందేందుకు వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్త వారికి పింఛన్లు మంజూరు చేయలేదు. రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులకు ఆశలు రేకెత్తాయి. కొత్త వారికి ఆసరా పింఛన్లు మంజూరు చేస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఏదీ ఆసరా?