శ్రీశైలం– హైదరాబాద్‌ రహదారిని విస్తరించాలి | - | Sakshi
Sakshi News home page

శ్రీశైలం– హైదరాబాద్‌ రహదారిని విస్తరించాలి

Oct 23 2025 9:18 AM | Updated on Oct 23 2025 9:18 AM

శ్రీశైలం– హైదరాబాద్‌ రహదారిని విస్తరించాలి

శ్రీశైలం– హైదరాబాద్‌ రహదారిని విస్తరించాలి

శ్రీశైలం– హైదరాబాద్‌ రహదారిని విస్తరించాలి కడ్తాల్‌: శ్రీశైలం– హైదరాబాద్‌ జాతీయ రహదారిని ఆరు లేన్లుగా విస్తరించాలని కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌ నేతలు నాగర్‌కర్నూల్‌ ఎంపీ డాక్టర్‌ మల్లురవికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం పీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు యాట నర్సింహ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీపాతి శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్‌లో ఎంపీని కలిసి వినతిపత్రం అందజేశారు. శ్రీశైలం– హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ సమస్య తీవ్రమైందని, తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ప్రయాణికులు ఇక్కట్లకు గురవుతున్నారని వివరించారు. రద్దీకి అనుగుణంగా ఆరు లేన్లుగా విస్తరించాలని కోరారు. స్పందించిన ఎంపీ విస్తరణపై ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి వివరించడం జరిగిందని, సీఎం రేవంత్‌రెడ్డి సైతం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలి గిరిజనుల భూములపై నివేదిక ఇవ్వండి రేపు తాండూరుకు మంత్రి వాకిటి శ్రీహరి రాక తాండూరు: నియోజవకర్గంలో శుక్రవారం రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్‌ పర్యటించనున్నారు. ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు లొంక నర్సింహులు గృహ ప్రవేశానికి మంత్రిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తాండూరు పట్టణ శివారులో ముదిరాజ్‌ భవన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం కోట్‌పల్లి ప్రాజెక్టులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లలు వదలనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పట్టణ శివారులో ముదిరాజ్‌ సంఘానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. శంకుస్థాపనకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంఘం నాయకులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పట్లోళ్ల బాల్‌రెడ్డి, నాయకులు ఉత్తమ్‌చంద్‌ తదితరులు ఉన్నారు.

కొందుర్గు: పంచాయతీ కార్మికుల పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలని పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు టంగుటూరి నర్సింహారెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జిల్లేడ్‌ చౌదరిగూడ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కార్మికులు బుధవారం ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నర్సింహా రెడ్డి మాట్లాడుతూ.. కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకుంటే పూట గడిచేదెలా అని ప్రశ్నించారు. కనీస వేతనాలు, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు పాపయ్య, గోపాల్‌, రమేష్‌, రవి, కిష్టయ్య, మల్లేష్‌, చెన్నయ్య, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.

శంకర్‌పల్లి: మండలంలోని కొండకల్‌ గ్రామంలో, సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వెలిమల గ్రామాల్లో ఉన్న గిరిజన భూములను పలువురు అధికారులు రికార్డులు తారుమారు చేసి వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులకు అప్పగిస్తున్నారంటూ జనవరి 3న బక్కా జడ్‌సన్‌ అనే సామాజిక కార్యకర్త జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణకు స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ జూలై 28న హైదరాబాద్‌లో రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఫిర్యాదుదారుడితో విచారణ జరిపింది. గిరిజనులు సాగుచేస్తున్న భూమిని ఏపీఐసీసీ తమ హక్కుగా చూపించడాన్ని ఫిర్యాదుదారుడు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో ఇటీవల ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌ విచారించి, కేసును ఇన్వెస్టిగేషన్‌ డివిజన్‌ బెంచ్‌కి బదిలీ చేశారు. సంబంధిత అధికారులు ఎనిమిది వారాల్లో పూర్తి నివేదిక అందించాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement