
దుస్తులు ఉతికేందుకు వెళ్లి మృత్యు ఒడికి..
● నీట మునిగిన అమ్మమ్మ, మనవరాలు
● పీరం చెరువు వద్ద ఘటన
మణికొండ: చెరువులో దుస్తులు ఉతికేందుకు వెళ్లిన ముగ్గురిలో ఇద్దరు నీట మునిగి చనిపోయిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పీరం చెరువులో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీరం చెరువు గ్రామంలో నివసిస్తున్న యూసుఫ్ బీ(60), ఆమె మనుమరాళ్లు సబియా(10), అయేషాలు మంగళవారం మధ్యాహ్నం దుస్తులు ఉతికేందుకు జేఎన్‌ఎన్‌యుఆర్‌ఎం క్వార్టర్స్ సమీపంలోని పీరం చెరువుకు వెళ్లా రు. అక్కడ దుస్తులు ఉతుకుతున్న క్రమంలో కాలుజారి యూసుఫ్ బీ నీటిలో మునిగిపోయింది. ఆమె ను కాపాడే క్రమంలో సబియా నీటిలోకి వెళ్లడంతో ఇద్దరు ఈతరాక మునిగిపోయారు. వారి పక్కనే ఉన్న ఆయేషా అరుచుకుంటూ బయటకు వచ్చి యూసుఫ్‌బీ అల్లు డు మహమ్మద్‌కు ఫోన్‌లో విషయం తెలిపింది. దాంతో అతను వెంటనే అక్కడకు వచ్చి స్థానికు ల సహాయంతో చెరువులో వెతకగా ఇద్దరి మృతదేహాలు బయట పడ్డాయి. మహమ్మద్ ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించా రు. ఒకే కుటుంబానికి చెందిన అమ్మమ్మ, మనవరా లు నీట మునిగి మృతి చెందటంతో పీరం చెరువు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.