
డ్రోన్ పిచికారీతో సమయం ఆదా
షాబాద్: డ్రోన్ పిచికారీపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని అకిన్ అనలెటిక్స్ సంస్థ డైరెక్టర్, హెచ్‌ఆర్ సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్ అమృత్‌రాజ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని రేగడిదోస్వాడలో సుగుణ మాల రైతు ఉత్పత్తిదారుల సంఘం రైతులకు డ్రోన్‌తో పురుగు, తెగుళ్ల మందు, ఎరువుల పిచికారీ ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డ్రోన్ పిచికారీతో సమయం ఆదాతో పాటు ఎక్కువ విస్తీర్ణంలో పంటలు కాపాడి దిగుబడి పెరుగుతుందన్నారు. ఎకరాకు ఐదు నుంచి ఆరు నిమిషాల్లో స్ప్రేయింగ్ పూర్తవుతుందని చెప్పారు. సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ రత్నాకర్ మాట్లాడుతూ... ఈ సాంకేతిక పరిజ్ఞానంతో పురుగు మందు వ్యయం, శ్రమ, ఖర్చు, నీటి అవసరాన్ని తగ్గించవచ్చన్నారు. డ్రోన్లతో ప్రభావవంతంగా ఏకరీతిలో పురుగు మందు పిచికారీ చేయమచ్చాన్నారు. చీఫ్ అకడమిక్ అధికారి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు సాంకేతిక పరిజ్ఞానం పెంచుకుంటే పెట్టుబడి తగ్గి దిగుబడి పెరుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో డ్రోన్ పైలెట్స్ పవన్, మనోజ్ కుమార్, దిలీప్ కుమార్, రైతులు ప్రవీణ్, మాధవరెడ్డి, మల్లారెడ్డిగూడ, తిర్మలాపూర్, బొబ్బిలిగామ రైతులు పాల్గొన్నారు.
అకిన్ అనలెటిక్స్ సంస్థ డైరెక్టర్, హెచ్‌ఆర్ సుబ్బారావు