
శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం
మొయినాబాద్ రూరల్: శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయమని రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్ అన్నారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోల్‌కట్ట గేట్, మొయినాబాద్ ఎక్స్ రోడ్, హిమాయత్ నగర్ చౌరస్తా, అజీజ్ నగర్ చౌరస్తా, గండిపేట్ చౌరస్తా, వీరన్నపేట్‌లో బుధవారం రాత్రి నాకాబందీ నిర్వహించారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులను విచారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరాల నియంత్రణలో పోలీసులకు సహకరించాలని కోరారు. తనిఖీల్లో ఇద్దరు ఏసీపీలు, ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు, 12 మంది ఎస్‌ఐలు, 65 మంది సిబ్బంది పాల్గొన్నారు.