
స్కాలర్‌షిప్ నిధులు విడుదల చేయాలి
చేవెళ్ల: ప్రభుత్వం సకాలంలో విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్‌షిప్‌లు, ఫీజురీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవటంతో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ సహాయ కార్యదర్శి చరణ్‌గౌడ్ అన్నారు. పట్టణ కేంద్రంలో బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కమిటీ సభ్యుడు చందు ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులతో కలిసి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి ఏఓ రాజశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ బకాయిలను మొత్తం చెల్లిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత స్పందించటం లేదన్నారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేవారు. లేదంటే సీఎం క్యాంపు కార్యాలయం మట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు యశ్వంత్, ఇర్మాణ్, శ్రీశైలం, మనీ, విష్ణు, రిషి, వేణు, శివ, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళన