ఏటీఎం కార్డు మార్చేసి.. రూ.40 వేలు డ్రా! | - | Sakshi
Sakshi News home page

ఏటీఎం కార్డు మార్చేసి.. రూ.40 వేలు డ్రా!

Oct 16 2025 8:15 AM | Updated on Oct 16 2025 8:15 AM

ఏటీఎం కార్డు మార్చేసి.. రూ.40 వేలు డ్రా!

ఏటీఎం కార్డు మార్చేసి.. రూ.40 వేలు డ్రా!

మొయినాబాద్‌ రూరల్‌: ఓ మహిళను ఏమార్చి ఏటీఎం కార్డు మార్చేసిన దుండగులు రూ.40 వేలు డ్రా చేసుకున్నారు. సీఐ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్‌కు చెందిన రమాదేవి గత మంగళవారం ఉదయం చేవెళ్ల బస్టాప్‌లోని ఎస్‌బీఐ ఏటీఎం మిషన్‌ ద్వారా రూ.40 వేల నగదు తన ఖాతాలో జమ చేసింది. ఫోన్‌కు మెస్సేజ్‌ రాకపోవడంతో మధ్యాహ్నం 2గంటలకు ఏటీఎం వద్దకు వెళ్లి మినీ స్టేట్‌మెంట్‌ తీసుకుంది. ఆవెంటనే అక్కడే ఉన్న నలుగురు వ్యక్తులు ఆమెను ఏమార్పి మిషన్‌లో తన కార్డుకు బదులు మరో కార్డు పెట్టారు. కొద్ది సేపటి తర్వాత తన ఖాతా నుంచి రూ.40 వేలు విత్‌డ్రా చేసినట్లు మెసేజ్‌ రావడంతో ఆందోళనకు గురైన రమాదేవి బ్యాంకు వెళ్లగా నగదు తీసినట్లు చెప్పారు. దీంతో వెంటనే ఖాతాను క్లోజ్‌ చేయించి, పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వ్యక్తిపై దాడి

కేపీహెచ్‌బీకాలనీ: ఇంటిముందు ద్విచక్ర వాహనం పార్కు చేయొద్దని చెప్పినందుకు ఓ వ్యక్తిపై దాడి చేశారు. ఈ సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. కేపీహెచ్‌బీ కాలనీ 5వ రోడ్డులో నివాసం ఉండే నరసింహనాయుడు ఇంటి పక్కనే శివా బాయ్స్‌ హాస్టల్‌ ఉంది. అయితే ప్రతి రోజూ హాస్టల్‌ యువకులు తమ ఇంటి ఎదుట ద్విచక్ర వాహనాలు పార్కు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఇంటి ఎదుట బండి పార్కు చేస్తున్నారనే కోపంతో సీట్‌ కవర్‌ను కట్‌ చేశారు. దీంతో మంగళవారం రాత్రి ప్రదీప్‌, వంశీలతోపాటు మరికొందరు యువకులు తమ బండి సీట్‌ కవర్‌ కట్‌ చేయడాన్ని ప్రశిస్తూ నరసింహనాయుడుపై దాడి చేశారు. ఇరువర్గాలకు చెందిన వారు పరస్పరం దాడి చేసుకోవడంతో పాటు కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఇరువురిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మేఘా కృష్ణారెడ్డి మాతృమూర్తికి ఘన నివాళి

నివాళులు అర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి,

ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

సాక్షి, సిటీ బ్యూరో: మేఘా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణారెడ్డి మాతృమూర్తి పురిటిపాటి విజయలక్ష్మికి పలువురు నివాళులులు అర్పించారు. బుధవారం హైటెక్స్‌లో జరిగిన సంస్మరణ కార్యక్రమానికి సీఏం రేవంత్‌రెడ్డి, ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో పాటు పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, వివిధ రంగాలకు చెందిన అధికార, అనధికార ప్రముఖులు మేఘా సంస్థ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిసానుభూతి తెలిపారు. తొలుత వారి కుటుంబ సభ్యులు హైటెక్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై విజయలక్ష్మి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. నివాళులు అర్పించిన ప్రముఖుల్లో కేంద్ర మంత్రులు జి కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌, భూపతిరాజు శ్రీనివాసవర్మ,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

సిమెంట్‌ లారీ ఢీ : యువకుడి దుర్మరణం

మోకిల పీఎస్‌ పరిధిలో ఘటన

శంకర్‌పల్లి: ఓ సిమెంట్‌ లారీ బైక్‌ను ఢీ కొట్టిన సంఘటన బుధవారం రాత్రి మోకిల పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నర్సాపురానికి చెందిన మణికంఠ(29) బీటెక్‌ పూర్తి చేసి, ఉద్యోగరీత్యా ఏడాది క్రితం హైదరాబాద్‌కి వచ్చాడు. కొద్ది నెలల క్రితం మోకిల పీఎస్‌ పరిధిలోని మియాఖాన్‌ గడ్డకు వచ్చి, ఇక్కడే నివాసం ఉంటూ టిఫిన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసుకుని, జీవనం సాగిస్తున్నాడు. బుధవారం సాయంత్రం టిఫిన్‌ సెంటర్‌లో పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా.. శంకర్‌పల్లి నుంచి హైదరాబాద్‌ వైపు అతివేగం, అజాగ్రత్తగా వెళ్తున్న సిమెంట్‌ లారీ ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో మణికంఠ అక్కడికక్కడే మృతి చెందగా, లారీ డ్రైవర్‌ని స్థానికులు పట్టుకుని పోలీసులు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి తల్లిదండ్రులతో పాటు వివాహం అయిన ముగ్గురు అక్కలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement