
గంజాయి విక్రేతల అరెస్టు
8.400 కిలోల గాంజా స్వాధీనం
యాచారం: ఇద్దరు గంజాయి విక్రేతలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 8.400 కిలోల గాంజాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన నాగార్జునసాగర్– హైదరాబాద్ రహదారి గునుగల్ గేట్ వద్ద చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లాకుచెందిన బలరామ్ కోబాసి, ఉంగా పడియామిలు ఇద్దరు.. హైదరాబాద్‌కు చెందిన నిరజ్‌కుమార్ యాదవ్‌కు రూ.80 వేలకు విక్రయించడానికిగంజాయిని తీసుకువచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం గునుగల్ గేట్ వద్ద అనుమానాస్పదంగాసంచరిస్తున్న వీరిని.. అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాగ్‌లను తనిఖీ చేయగా.. గంజాయి పట్టుబడింది. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయితో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. ఒడిశా అటవీ ప్రాంతంలో పండించిన గాంజాను తెచ్చి, నగరంలో విక్రయిస్తుంటామని ఒప్పుకొన్నారు. వీరిద్దరిని శనివారం రిమాండ్‌కు తరలించామని సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపారు.