
లడ్డూలు.. రూ.లక్షలు!
● అత్తెల్లి బ్రదర్స్ పాట రూ.16,11,001
● ‘రచ్చబండ’ వేలంలో గణేశ్ లడ్డూ సొంతం
చేవెళ్ల: పట్టణంలోని రచ్చబండ వినాయకుడి లడ్డూ ప్రసాదం రూ.16,11,001 పలికింది. శనివారం రాత్రి నిర్వహించిన శోభాయాత్రలో భాగంగా నిర్వహించిన వేలం పాటలో అత్తెల్లి బ్రదర్స్ స్వామివారి లడ్డూను దక్కించుకున్నారు. గతేడాదికన్నా ఈసారి రూ.8 వేలు అధికంగా పలికింది.
శంకర్‌పల్లిలో..
శంకర్‌పల్లి: మున్సిపాలిటీ, మండలంలో గణనాథుని లడ్డూల ధరలు భారీగా పలికాయి. మున్సిపాలిటీ పరిధిలోని బుల్కాపూర్ హనుమాన్ మందిర్ గణేశ్ లడ్డూను మణికొండ మల్లారెడ్డి రూ.8 లక్షలకు దక్కించుకున్నారు. మండలంలోని మాసానిగూడ హనుమాన్ మందిర్ గణేశ్ లడ్డూను శంకర్‌పల్లి కురుమ సంఘం ఉపాధ్యక్షుడు శ్రీశైలం రూ.7.20 లక్షలకు సొంతం చేసుకున్నాడు. విఠలేశ్వరాలయం వద్ద ప్రతిష్టించిన స్వామివారి లడ్డూను రూ.9,11,116 ఏనుగు పవన్ కుమార్‌రెడ్డి, ఏనుగు అనిల్ కుమార్‌రెడ్డి సోదరులు దక్కించుకున్నారు. నిర్వాహకులు వీరిని శాలువాతో ఘనంగా సన్మానించారు.

లడ్డూలు.. రూ.లక్షలు!