మద్యం మత్తులో పోలీసు వాహనాన్ని ఢీకొన్న కారు | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో పోలీసు వాహనాన్ని ఢీకొన్న కారు

Sep 8 2025 9:40 AM | Updated on Sep 8 2025 9:40 AM

మద్యం మత్తులో పోలీసు వాహనాన్ని ఢీకొన్న కారు

మద్యం మత్తులో పోలీసు వాహనాన్ని ఢీకొన్న కారు

యువతి మృతి

డీఐ, కానిస్టేబుల్‌కు గాయాలు

లంగర్‌హౌస్‌: మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడుపుతూ కొందరు విద్యార్థులు పోలీసు వాహనాన్ని ఢీకొట్టగా.. ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన లంగర్‌హౌస్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ వెంకటరాములు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అత్తాపూర్‌కు చెందిన హరీష్‌ రెండు రోజుల క్రితం తాము ఏర్పాటు చేసిన వినాయకుడిని నిమజ్జనం చేశారు. వేడుకలు ఘనంగా జరగడంతో మిత్రులకు పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇక్‌ఫాయ్‌ యూనివర్సిటీ లో బీబీఏ చదువుతున్న తన స్నేహితులను పార్టీకి ఆహ్వానించాడు. పంజాబ్‌కు చెందిన కాశ్వి విజయ్‌ వర్గి(20), ఆమె సోదరుడు ఇంటర్‌ విద్యార్తి తనిష్క్‌ విజయ్‌ వర్గి, రియా విజయ్‌వర్గిలు పార్టీకి హాజరయ్యారు. ఆదివారం తెల్లవారుజామున కోఠిలో ఉంటున్న అక్షిత్‌ సింగ్‌ కారులో వారు నలుగురితో పాటు కూకట్‌పల్లికి చెందిన లిఖిత షిండేతో కలిసి బయల్దేరారు. మొఘల్‌నగర్‌ రింగ్‌ రోడ్డు వైపు వినాయక నిమజ్జనం నేపథ్యంలో ట్రాఫిక్‌జామ్‌ కావడంతో పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే పిల్లర్‌ నెంబర్‌ 112 నుంచి మూసీ పక్క రోడ్డులో వెళ్లి లంగర్‌హౌస్‌ మీదుగా పీ ఇంద్రారెడ్డి ఫ్లై ఓవర్‌ ఎక్కారు. బ్రిడ్జి దిగే క్రమంలో అతివేగం కారణ ంగా కారు ముందు వెళుతున్న పోలీసు వాహనాన్ని వెనక నుంచి బలంగా ఢీకొంది. దీంతో కారు వెనక సీట్‌లో కూర్చున్న కాశ్వి సింగ్‌ ఛాతి, తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

తప్పిన పెను ప్రమాదం

ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఎయిర్‌ బ్యాగులు తెరుచుకోవడంతో ముందు కూర్చున్న వారు గాయాలతో బయటపడ్డారు. వెనక కూర్చున్న కాశి మృతిచెందగా ఆమె సోదరుడు తనిష్క్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే పోలీసు వాహనాన్ని ఢీ కొట్టగా పోలీసు వాహనం ముందు వెళుతున్న డీసీఎంను ఢీ కొట్టింది. అయితే పోలీసు వాహన డ్రైవర్‌తో పాటు, డీసీఎం డ్రైవర్‌ అప్రమత్తమై హాండ్‌ బ్రేక్‌ వేయడంతో వాహనాలు కొద్దిగా ముందుకు వెళ్లి ఆగిపోయాయి. లేని పక్షంలో ముందు ఉన్న ఊరేగింపులపైకి దూసుకెళ్లి పెను ప్రమాదం జరిగేది. ఈ ఘటనలో డీఐ సత్యనారాయణకు తీవ్ర గాయాలు కాగా కానిస్టేబుల్‌ వాజీద్‌, హోంగార్డు అలీముద్దీన్‌ను స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. పోలీసులు వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాశ్వి మృతదేహానికి ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement