
యూరియా వచ్చింది.. కలత తీరింది!
యాచారం: యూరియా కొరత కారణంగా నిన్నమొన్నటి వరకు కర్షకులు కలత చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. సాగు పనులు వదిలి.. శాంతడంత పొడవుగా పీఏసీఎస్, ఫర్టిలైజర్ దుకాణాల వద్ద గంటల కొద్దీ క్యూ కట్టారు. దీనికి స్పందించిన ప్రభుత్వం, అధికారులు.. ‘యూరియా కోసం రైతులు ఇబ్బంది పడొద్దు. అవసరం మేరకు స్టాక్ వస్తోంది. అందరికీ అందజేస్తాం’ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగతా ప్రాంతాల్లో ఎలా ఉన్నా.. తాజాగా సెలవు రోజైన ఆదివారం.. యాచారం మండల కేంద్రంలోని వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం వద్ద యూరియా పంపిణీ చేశారు. 450 మందికి టోకెన్లు ఇచ్చి, పోలీసుల సమక్షంలో ఒకొక్కరికి రెండు బస్తాల చొప్పున అందజేశారు. సరఫరా ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. గత నాలుగైదు దఫాలుగా యూరియా కోసం వందలాది మంది రైతులు ఆందోళన చెసిన విషయం విధితమే.