
పొలంలో పడి వ్యక్తి మృతి
కేశంపేట: ప్రమాదవశాత్తు వరిపొలంలో పడిన వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధి చింతకుంటపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వేముల్‌నర్వకు చెందిన చంద్రయ్య(45) మద్యానికి బానిపై జులాయిగా తిరిగేవాడు. భర్త తాగుడును భరించలేక భార్య మంజుల పదేళ్ల క్రితం అతడిని వదిలి, పిల్లలతో కేశంపేటలో నివసిస్తోంది. చంద్రయ్య మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న కుటుంబీకులు ఘటనా స్థలానికి వచ్చి, మృతదేహాన్ని గుర్తించారు. ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెంది ఉంటాడని పోలీసులు, కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మృతుడి సోదరుడు శ్రీను ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.