గొలుసు దొంగలున్నారు.. జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

గొలుసు దొంగలున్నారు.. జాగ్రత్త

Aug 31 2025 8:08 AM | Updated on Aug 31 2025 8:08 AM

గొలుసు దొంగలున్నారు.. జాగ్రత్త

గొలుసు దొంగలున్నారు.. జాగ్రత్త

సీఐ విజయ్‌కుమార్‌

షాద్‌నగర్‌రూరల్‌: ఏమార్చి ఆభరణాలను అపహరించే దొంగలు ఉన్నారని, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పట్టణ సీఐ విజయ్‌కుమార్‌ అన్నారు. శనివారం ఆయన మాట్లాడారు. నలుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి ద్విచక్రవాహనాలపై వచ్చి బంగారు గొలుసులను దోచుకెళ్తున్నారని తెలిపారు. ఆ ముఠా సభ్యులు తమిళ యాసలో తెలుగులో మాట్లాడుతూ.. రోడ్డుపై వెళ్లే వారిని ఆపి తాము పోలీసులమని, బంగారం మెడలో వేసుకొని తిరగొద్దని, చోరీలు జరుగుతున్నాయని నమ్మిస్తున్నారని వివరించారు. ఆ తరువాత వారిని మాటల్లో పెట్టి, మెడలో నుంచి గొలుసు తీసుకొని మూట కట్టిస్తామని ఓ పేపర్‌లో చుట్టినట్లుగా నమ్మించి సొమ్ముతో బైక్‌పై పరారవుతారని వెల్లడించారు. ఈ తరహా దొంగతనాలు మహబూబ్‌నగర్‌ పట్టణంతో పాటు, రూరల్‌ ప్రాంతాల్లో జరుగుతున్నాయన్నారు. అలాంటి ముఠా ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని, వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement