
బస్సులోంచి పడి.. కేర్ టేకర్‌కు గాయాలు
శంకర్‌పల్లి: కదులుతున్న పాఠశాల బస్సులో నుంచి ప్రమాదవశాత్తు కేర్ టేకర్ పడిపోయాడు. ఈ సంఘటన శనివారం శంకర్‌పల్లి పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. సింగాపురం గ్రామానికి చెందిన నర్సింహులు(45), పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాల బస్సులో కేర్ టేకర్‌గా పని చేస్తున్నాడు. శనివారం సాయంత్రం 3.30 గంటలకు స్కూల్ ముగిసిన తర్వాత విద్యార్థులను తీసుకొని బస్సులో వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద నర్సింహులు అకస్మాత్తుగా బస్సులో నుంచి రోడ్డుమీద పడిపోయాడు. ఈ ఘటనంలో సదరు వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఫిట్స్ రావడంతో బాధితుడు కింద పడిపోయాడని వైద్యులు గుర్తించి, వైద్యం అందిస్తున్నారు.