
నాలుగు నెలల్లో 39 కేసులు
కొడంగల్ రూరల్: అంగడిరాయిచూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుక్క కాటుకు సంబంధించిన మందులతో పాటు సీజనల్ వ్యాధులకు సంబందించిన మందులు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ బుస్రా ఫాతిమా తెలిపారు. శనివారం మండల పరిధిలోని అంగడిరాయిచూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాగ్ బైట్స్‌కు సంబంధించిన వివరాలను కోరగా కుక్క కాటుకు గురైనవారికి ఐదు డోసుల ట్రీట్‌మెంట్ ఇస్తామన్నారు. 0, 3, 7, 14, 28 రోజులలో ఐదు డోసులుగా మందులను అందిస్తున్నామని, మేలో తొమ్మిది, జూన్‌లో 13, జూలైలో ఎనిమిది, ఆగస్టులో తొమ్మిది కేసులు నమోదయ్యాయని చెప్పారు.