
లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులు ప్రారంభించండి
షాద్‌నగర్: పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా షాద్‌నగర్ పరిధిలోని జిల్లేడు చౌదరిగూడ మండలంలో నిర్మించ తలపెట్టిన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి, వెంటనే పనులు ప్రారంభించాలని షాద్‌నగర్, పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు అసెంబ్లీ హాల్‌లో ముఖ్యమంత్రిని కలిసి విన్నవించారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తయితే తాగు, సాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. అదేవిధంగా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.