మొయినాబాద్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైంది. పోలీసుల వివరాల ప్రకారం.. మొయినాబాద్‌కు చెందిన గొల్ల నాగప్ప భార్య కవిత(26) కూలీ పనులకు వెళ్లేది. ఎప్పటిలాగే గురువారం ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. సాయంత్రం తిరిగి రాకపోవడంతో భర్త నాగప్ప పరిసర ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వెతికాడు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
ఆమనగల్లు: రోడ్డు ప్ర మాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన పట్టణంలోని హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిపై రాజీవ్ కూడలి వద్ద గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళపల్లి గ్రామానికి చెందిన దరువుల శేఖర్(20) రాత్రి 12 గంటల సమయంలో తన ద్విచక్ర వాహనంపై మంగళపల్లివెళ్తుండగా.. చౌరస్తా వద్ద ఇన్నోవా కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శేఖర్ ఎగిరి కింద అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.మృతుడి తండ్రి చెన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
డీసీఎం ఢీకొనిఇద్దరికి తీవ్ర గాయాలు
యాచారం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని కొత్తపల్లికి చెందిన పరమేశ్, ప్రవీణ్ శుక్రవారం ఉదయం బైక్‌పై తక్కళ్లపల్లి గేట్ వద్దకు వెళ్తుండగా మార్గమధ్యలో డీసీఎం ఢీకొట్టింది. ఇరువురికీ తీవ్ర గాయాలు కాగా పోలీసులు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా పరమేశ్ హైదరాబాద్ సీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపారు.
మత్తు ట్యాబ్లెట్లు విక్రయిస్తున్న యువకుడి అరెస్ట్
200 మత్తు ట్యాబ్లెట్లు స్వాధీనం
రాజేంద్రనగర్: మత్తు టాబ్లెట్లను విక్రయిస్తున్న ఓ యువకుడిని శంషాబాద్ ఎకై ్సజ్ పోలీసులు అదుపులోకి తీసుకుని అతడి నుంచి 200 ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పర్‌పల్లిలోని శంషాబాద్ ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ దేవేందర్ రావు శుక్రవారం వివరాలు వెల్లడించారు. మహరాష్ట్రకు చెందిన నందే బ్రిడ్జ్ బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చాడు. ఉప్పర్‌పల్లి ప్రాంతంలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అతడి స్నేహితుడు నాగరాజు కర్ణాటకకు వెళ్లి మత్తు ట్యాబ్లెట్లను కొనుగోలు చేసి తీసుకొచ్చాడు. వాటిని అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పడంతో నందే బ్రిడ్జ్ నాగరాజు వద్ద వాటిని కొనుగోలు చేసి విక్రయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందడంతో ఎకై ్సజ్ పోలీసులు శుక్రవారం ఉదయం ఉప్పర్‌పల్లిలో అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడి నుంచి 200 ట్యాబ్లెట్లను స్వాఽధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించా రు. కర్ణాటక నుంచి ట్యాబ్లెట్లను తీసుకొచ్చిన నాగరాజు పరారీలో ఉన్నట్లు తెలిపారు.