మున్సిపల్ అభివృద్ధికి ప్రణాళిక
షాద్‌నగర్: మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని సాయిబాలాజీ టౌన్‌షిప్‌లో అమృత్ పథకంలో భాగంగా రూ.76లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న తాగునీటి పైప్‌లైన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సునీత, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్‌ఖాన్, నాయకులు తిరుపతిరెడ్డి, రఘు నాయక్, శ్రీకాంత్‌రెడ్డి, శివశంకర్, ప్రవీణ్, ఖదీర్, ముబారక్, అప్పి, జయప్రకాశ్, కరుణాకర్, రవిజేత, దిలీప్, శ్రీధర్, మాధవులు తదితరులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
నందిగామ: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవాలయం ముఖద్వారం, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. ముఖద్వార నిర్మాణం, కమ్యూనిటి హాల్ నిర్మాణానికి రూ.15 లక్షల చెక్కు అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్, ఎంపీటీసీ మాజీ సభ్యులు కొమ్ము కృష్ణ, చంద్రపాల్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, చించేటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్