పేకాట స్థావరంపై పోలీసుల దాడి | - | Sakshi
Sakshi News home page

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

Aug 30 2025 8:44 AM | Updated on Aug 30 2025 8:50 AM

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

కొత్తూరు: పేకాట స్థావరంపై ఎస్‌ఓటీ, స్థానిక పోలీసులు దాడి చేసిన సంఘటన శుక్రవారం మండల పరిధి ఇన్ముల్‌నర్వ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ శివారు వీవీఆర్‌ వెంచర్లో కొందరు జూదం ఆడుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు ఆ స్థావరంపై మూకుమ్మడిగా దాడి చేశారు. జూదరులు యెన్నం రఘుమారెడ్డి, నర్సింహ్మ, అంజయ్య, దాస్య, రమేష్‌, మోహిన్‌, ఖలీల్‌లను అదుపులోకి తీసుకోగా.. మరో వ్యక్తి అఖిల్‌ పరారీలో ఉన్నాడు. పేకాటరాయుళ్ల నుంచి రూ.32 వేల 600 నగదు, 5 బైకులు, 5 సెల్‌ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement