
నిషేధిత జాబితాలో ఉన్న భూములు విడిపించండి
హిమాయత్‌నగర్: మహేశ్వరం మండలం కొంగరకుర్తి–ఎ గ్రామంలో నిషేధిత జాబితాలో ఉన్న 600 ఎకరాల భూములను విడిపిస్తానని ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని తక్షణం అమలు చేయాలని గ్రామరైతులు డిమాండ్ చేశారు. బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్‌లో గురువారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిషేధిత జాబితాలో చేర్చడంతో 200 ఎకరాల్లో రైతు కుటుంబాలు వ్యవసాయం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాయని తెలిపారు. రాజకీయ నేతల అండదండ లతో కొంతమంది కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ భూములన్నీ ఇనాం, వక్ఫ్, వ్యవసా యానికి చెందినవిగా పహణీలో ఉన్నాయని స్పష్టం చేశారు. భూములపై గతంలో కొంతమందికి ఇచ్చి న ఓఆర్‌సీ కన్వర్షన్ రద్దుచేయాలని, భూములను విడిపించి న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో రైతులు ఎన్.వెంకటేశ్ గౌడ్, ఎస్.కృష్ణారెడ్డి, వై.వేణుగోపాల్, జంగయ్య, ఆర్.శేషగిరిరావు, వై.గోపాల్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.