
యువతి అదృశ్యం
మాడ్గుల: యువతి అ దృశ్యమైన సంఘటన మాడ్గుల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వేణుగోపాల్‌రావు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని ఫిరోజ్‌నగర్ గ్రామానికి చెందిన పూజ(25) మంగళవారం ఉదయం తల్లిదండ్రులు నిద్రలేచి చూసే సరికే ఇంట్లో కనిపించలేదు. స్నేహితులు, బంధువులు ఇళ్లలో వెతికినా ఆచూకీ తెలియక పోవడంతో మరుసటిరోజు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొ ని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.
మూసీనదిలోయువకుడి గల్లంతు
చాదర్‌ఘాట్: చాదర్‌ఘాట్ వద్ద మూసీ ప్రవాహంలో ఓ యువకుడు గల్లంతైన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శంకర్‌నగర్‌కు చెందిన మహ్మద్ సలీం (32) కూలీగా పని చేస్తున్నాడు. గురువారం తాగిన మత్తులో అతను ఈత కొట్టేందుకు మూసీ నదిలోకి దూకాడు. నదిలో ప్రవాహం ఉధృతంగా ఉండటంతో గల్లంతయ్యాడు. దీనిపై సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డీఆర్‌ఎఫ్ బృందాలతో కలిసి గాలింపు చేపట్టారు.
యువతితో అసభ్య ప్రవర్తన..
ఇద్దరు యువకుల రిమాండ్..
బంజారాహిల్స్: తనతో పనిచేస్తున్న ఉద్యోగితో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఇద్దరు యువకులు తమ బైక్‌ను అడ్డగించి తనను దుర్భాషలాడటమేగాక తాను వేసుకున్న డ్రెస్‌పై కామెంట్లు చేస్తూ న్యూసెన్స్‌కు పాల్పడ్డారంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూ బ్లీహిల్స్ పోలీసులు ఇద్దరు యువకులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. బేగంపేటలో నివసించే ఓ యువతి ఈ నెల 22న ఆరోగ్యం బాగోలేకపోవడంతో తనతో పనిచేస్తున్న యువకుడితో కలిసి బై క్‌పై ఆస్పత్రికి వెళ్తుంది. అయితే కార్ఖానాకు చెందిన సోహైల్, రిజ్వాన్‌ఖాన్ అనే ఇద్దరు యువకులు బైక్‌పై ఆమెను వెంబడించి జూ బ్లీహిల్స్ రోడ్డునెంబర్–36లోని బ్యాంక్ ఆఫ్ బరోడా సమీపంలో అడ్డగించారు. ఇతర మ తస్తుడితో ఎందుకు వెళుతున్నావంటూ ఆమె ను నిలదీశారు. మెడికల్ ఎమెర్జెన్సీ ఉండడంతో ఆస్పత్రికి వెళ్తున్నానని, తనతో పనిచేస్తు న్న ఉద్యోగి ఆస్పత్రికి తీసుకువెళ్తున్నాడని ఆమె బతిమిలానా వినిపించుకోకుండా దర్భాషలాడారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు పరారీలో ఉన్న నిందితులిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
పంజాబ్ ప్రయాణికుడి వద్ద బుల్లెట్ల పట్టివేత
శంషాబాద్: పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు లభ్యమైన సంఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం రేపింది. ఆర్‌జీఐఏ ఔట్‌పోస్ట్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పంజాబ్ రాష్ట్రం, భవానిగర్గ్‌కు చెందిన సుఖ్‌దీప్ సింగ్ ఇండిగో విమానంలో గురువారం వయా ఢిల్లీ నుంచి అమృత్‌సర్ బయలుదేరే విమానంలో బోర్డింగ్ అవుతుండగా భద్రతాధికారులు అతడి లగేజీని పరిశీలించారు. అందులో 02.ఎంఎం నాలుగురౌండ్లు, 0.7 ఎంఎం రెండు రౌండ్లు, 7,52 ఒక రౌండు ,7.62 ఒక రౌండు లభ్యమయ్యాయి. బుల్లెట్లకు సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్లు అతడి వద్ద లేకపోవడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాడు.ఈ నెల 22 తాను నాందేడ్ నుంచి గురుద్వార్‌కు బస్సులో ప్రయాణం చేసినట్లు అతడు తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.