
మట్టి గణపతులను పూజిద్దాం
ఇబ్రహీంపట్నం రూరల్: పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి ప్రతిమలను వినియోగించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 27న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పర్యావరణాన్ని పరిరక్షించడానికి మట్టి గణపతులనే పూజిద్దామన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ని నిర్మూలించే దిశగా మట్టితో చేసిన గణనాథులను ఏర్పాటు చేసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలన్నారు. జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపా రు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి బోర్డు ఏఈ వెంకట నర్సయ్య, ఏఈఎస్ ఆర్.మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ నారాయణరెడ్డి