
ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు చెల్లించాలి
అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్
ఇబ్రహీంపట్నం రూరల్: జిల్లాలో మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో గ్రౌండింగ్ పూర్తి చేసి బేస్మెంట్ స్థాయి వరకు వచ్చిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు అందజేయాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, వనమహోత్సవం, గణేశ్ నవరాత్రి ఉత్సవాలపై మంగళవారం కలెక్టరేట్‌లోని అడిషనల్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు అందించాలని చెప్పారు. మున్సిపాలిటీలల్లో నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్‌ను అధిక సంఖ్యలో చేపట్టాలని కమిషనర్లకు సూచించారు. వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నయన్నారు. సెప్టెంబర్ 6వ తేదీన నిమజ్జనం చేయనున్నందున, వినాయక మండపాలు ఏర్పాటు చేసే భక్తులు నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో సురక్షిత వాతావరణంలో పండగ జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.