
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఇబ్రహీంపట్నం: భవన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లేశ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి స్వప్న డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం అసిస్టెంట్ లేబర్ కార్యాలయం ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించి, సంబంధిత అధికారి ప్రమీలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. కార్డుల్లో పేర్లు తప్పులు దొర్లితే ఏఎల్‌ఓ సరి చేయాలన్నారు. కొత్త కార్డులు తీసుకోవాలన్నా, రెన్యూవల్స్ చేసుకోవాలన్నా కార్మికులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపించారు. కాలయాపన చేయకుండా ఆన్‌లైన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి కార్మికుల ఇబ్బందులను తొలగించాలన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు నర్సింహ, యాదగిరి, వీరేశం, జంగయ్య, రాజు, నర్సింగ్, భాస్కర్, శ్రీనివాస్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
ఏఎల్‌ఓ ఎదుట ధర్నా, వినతిపత్రం అందజేత