
రైతులు సహకరించాలి
మొయినాబాద్‌రూరల్: మున్సిపల్ పరిధిలోని ఎనికేపల్లి సర్వే నంబర్ 180లో 99.14 ఎకరాల్లో ప్రభుత్వం గోశాల ఏర్పాటుకు నిర్ణయించిందని.. ఇందుకు రైతులు సహకరించాలని చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ అన్నారు. బుధవారం ఆమె మొయినాబాద్ తహసీల్దార్‌తో కలిసి పోలీసు బందోబస్తు నడుమ రైతుల దగ్గరకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం పరిహారంగా 300 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు అందజేస్తుందని వివరించారు. రైతుల నుంచి వివరాలు సేకరించారు. 300 గజాల స్థలాన్ని తమకు అనుకూలంగా ఉన్న చోట ఇవ్వాలని నిర్వాసితులు కోరారు. ప్రభుత్వం నిర్ణయం మేరకు నడుచుకుంటూ రైతులకు న్యాయం చేస్తామని రెవెన్యూ అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఏసీపీ కిషన్, రాజేంద్రనగర్ ఏసీపీ రమణగౌడ్, మొయినాబాద్ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.
చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ
పోలీసుల బందోబస్తు నడుమ రైతులతో రెవెన్యూ అధికారుల ముఖాముఖి