
ప్లాటు వివాదంలో రాజీవ్ కనకాలకు నోటీసులు
హయత్‌నగర్: ఓ ఇంటి స్థలం వివాదంలో సాక్షిగా హాజరు కావాలంటూ సినీ నటుడు రాజీవ్ కనకాలకు హయత్‌నగర్ పోలీసులు నోటీసులు అందజేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పసుమాముల గ్రామంలోని సర్వే నంబర్ 421లో 230 గజాల ఇంటి స్థలాన్ని రాజీవ్ కనకాల సినీ ఇండస్ట్రీకి చెందిన విజయ్‌చౌదరికి విక్రయించారు. ఇతను తన పరిచయస్తుడు మనోజ్‌రెడ్డి ద్వారా సదరు ప్లాట్‌ను ఎల్‌బీనగర్‌కు చెందిన శ్రవణ్‌రెడ్డి అమ్మారు. అనంతరం ప్లాటు పొజిషన్ లేకుండా ఆనవాళ్లను తొలగించారు. దీంతో ఆందోళనకు గురైన శ్రవణ్‌రెడ్డి ప్లాటు విషయమై పలుమార్లు విజయ్‌చౌదరిని అడిగారు. ప్లాటు చూపకుండా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ శ్రవణ్‌రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్లాటు పూర్వాపరాలు తెలుకునేందుకు మొదటి ఓనర్ రాజీవ్ కనకాలకు నోటీసులు అందజేశారు.
నిష్ణాతులుగా తీర్చిదిద్దుతాం
ఇబ్రహీంపట్నం: గురునానక్ విద్యార్థులను ప్రపంచ స్థాయి ప్రొఫెషనల్స్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా విద్యాబోధన, శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆ యూనివర్సిటీ చాన్స్‌లర్ సర్దార్ గగన్‌దీప్ సింగ్ కోహ్లి అన్నారు. బీటెక్ విద్యార్థుల కోసం సాప్ భాగస్వామ్యంతో రూపొందించిన ఆధునిక కోర్సుల ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ట్రైనింగ్, ప్లేస్‌మెంట్స్ డైరెక్టర్ వినయ్ చోప్రా మాట్లాడుతూ.. ఉద్యోగావకాశాలు మెరుగుపర్చేందుకు ఇది ఎంతో దోహదపడుతుందని తెలిపారు.